పుష్పరాజ్ పాత్రతో నేషనల్ అవార్డ్ గెలుపొందారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయిన పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయగా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ లో మార్పును సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
రేపు సాయంత్రం 5:04 గంటలకు పుష్ప పుష్ప అంటూ సాగే పాటను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ స్టైల్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.