“పుష్ప 2 ది రూల్” అనుకున్న డేట్ కే!

“పుష్ప 2 ది రూల్” అనుకున్న డేట్ కే!

Published on Jan 2, 2024 5:16 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడనుంది అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ వచ్చింది. అనుకున్న డేట్ కే (ఆగస్ట్ 15, 2024) న సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

రోహిత్ శెట్టి, భారీ మల్టీస్టారర్ అయిన సింగం ఎగైన్ కూడా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప 2 ది రూల్ సోలోగా విడుదల అవుతుందా? సింగం ఎగైన్ నిర్మాతలు విడుదల తేదీని మారుస్తారా? లేకపోతే అల్లు అర్జున్ చిత్రంతో క్లాష్ కి రెడీ అవుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి. క్లాష్ జరిగితే మాత్రం రెండు సినిమాల థియేట్రికల్ వసూళ్ల పైనా ప్రభావం పడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు