26 గంటల్లో “పుష్ప 2” నార్త్ బుకింగ్స్ భారీ రికార్డు..!

26 గంటల్లో “పుష్ప 2” నార్త్ బుకింగ్స్ భారీ రికార్డు..!

Published on Dec 1, 2024 10:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరి ఈ హైప్ కి తగ్గట్టుగా భారీ బుకింగ్స్ ఈ చిత్రానికి కనిపిస్తున్నాయి.

అయితే నార్త్ లో పుష్ప మేనియా మాములుగా ఉండదు అని ఆల్రెడీ టాక్ ఉంది. మరి ఇందుకు తగ్గట్టు గానే పుష్ప 2 కి భారీ బుకింగ్స్ ఇపుడు నార్త్ చైన్స్ లో నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. హిందీలో ఏకంగా పుష్ప 2 కి 26 గంటల్లోనే లక్షకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. దీనితో బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో ఐకాన్ స్టార్ అక్కడ సత్తా చాటుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇది ఆరంభం మాత్రమే కాగా రిలీజ్ రోజు నాటికి మాత్రం ఇది ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు