ఓవర్సీస్‌లో ‘పుష్ప 2’ ఊచకోత.. తగ్గేదే లే!

ఓవర్సీస్‌లో ‘పుష్ప 2’ ఊచకోత.. తగ్గేదే లే!

Published on Dec 31, 2024 6:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం.

తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఏకంగా 15 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. క్లాస్, మాస్ ఆడియన్స్ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తుండటంతో ఈ మేరకు వసూళ్లు వస్తున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు