ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్‌తో ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుంది. అయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల దాటింది. దీంతో ఇప్పుడు అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
‘పుష్ప 2’ చిత్రానికి మరో 20 నిమిషాల ఫుటేజ్‌ను యాడ్ చేసి స్క్రీన్స్‌లో ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ కొత్త సీన్స్‌ను యాడ్ చేసిన రీలోడ్ వెర్షన్‌ను దర్శకుడు సుకుమార్ పుట్టినరోజైన జనవరి 11 నుంచి ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా మూడున్నర గంటలకు పైగా రన్‌టైమ్‌తో రానుంది. ఇక ఈ వెర్షన్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.