ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర ఇంకా సాలిడ్ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
అయితే, సంక్రాంతి కానుకగా అభిమానులకు ‘పుష్ప 2’ మేకర్స్ ఓ ట్రీట్ ఇవ్వాలని సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మరో 20 నిమిషాల అదనపు సీన్స్ యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయించారు. జనవరి 11 నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ ప్రదర్శనకు వస్తుందని ముందుగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రీలోడెడ్ వెర్షన్‌ను జనవరి 17 నుంచి థియేటర్లలో స్క్రీన్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.
#Pushpa2Reloaded in cinemas from January 17th. #Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/rLmX4PECLf pic.twitter.com/XXcmRoOVts
— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2025