హిందీలో ‘పుష్ప’ రాజ్ తాండవం.. లేటెస్ట్ వసూళ్లు ఇవే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం ఇండియా కూడా ఏ రేంజ్ లో మాట్లాడుకుంటుందో అందరికీ తెలిసిందే. అయితే తాను నటించిన భారీ చిత్రం “పుష్ప 2” ఓ పక్క భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇలా తెలుగు స్టేట్స్ సహా యూఎస్ ఇంకా హిందీ మార్కెట్ లో పుష్ప రాజ్ ఇపుడు తాండవం చేస్తున్నాడని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 హిందీ మార్కెట్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

ఇలా లేటెస్ట్ గా హిందీ వసూళ్ళ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. మరి సినిమా నిన్న శుక్రవారం 25 కోట్లకి పైగా వసూళ్లు అందుకుని అదరగొట్టిందట. దీనితో మొత్తం ఇపుడు వరకు 461 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని ఈ వారం పూర్తయ్యే నాటికి 500 కోట్ల క్లబ్ లో చేరిపోతాడు అని హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో నార్త్ మార్కెట్ లో మాత్రం పుష్ప రాజ్ తాండవం మామూలు లెవెల్లో లేదని చెప్పొచ్చు.

Exit mobile version