“పుష్ప 2” సంచలనం.. డే 10 క్రేజీ రికార్డు కొట్టిన ఇండియన్ సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా భారీ వసూళ్లు అందుకొని దంచి కొట్టింది. అయితే ఈ సినిమా డే 1 నుంచే క్రేజీ రికార్డులు సెట్ చేయగా ఇపుడు మరో క్రేజీ అండ్ సంచలన రికార్డు కొట్టినట్టుగా మేకర్స్ చెబుతున్నారు.

ఇలా పుష్ప 2 థియేటర్స్ లో 10వ రోజు ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని అందుకొని ఒక యునిక్ రికార్డు కొట్టినట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇలా రిలీజ్ తర్వాత పదో రోజు ఓ ఇండియన్ సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం ఒక బిగ్గెస్ట్ రికార్డు అని చెప్పాలి. మరి ఇది అల్లు అర్జున్ పుష్ప 2 తో సాధ్యం అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version