ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను స్టన్ చేయబోతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందా.. అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. గతంలో ‘పుష్ప-3’ గురించి కొన్ని వార్తలు వచ్చినా, మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా జరిగిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ దీనిపై సరదాగా ఓ కామెంట్ అయితే చేశాడు. బన్నీ మరో మూడేళ్లు సమయాన్ని కేటాయిస్తే, పుష్ప-3 చేస్తానని ఆయన అన్నారు. అయితే, పుష్ప-2 క్లైమాక్స్‌లో పుష్ప-3 మూవీకి సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా దీనికి సంబంధించి ఓ ఎడిటింగ్ రూమ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 3 – ది ర్యాంపేజ్’ అనే టైటిల్‌తో ‘పుష్ప 2’కి సీక్వెల్ మూవీ రాబోతుందని ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. మరి నిజంగానే ఇదే టైటిల్‌ను మేకర్స్ మనకు ‘పుష్ప-2’ క్లైమాక్స్‌లో చూపెట్టబోతున్నారా.. అనేది చూడాలి.
A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema.
A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering…
— Allu Arjun (@alluarjun) December 3, 2024