ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిర్రమ్ “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర తిరగ రాస్తుంది. అలాగే మెయిన్ గా నార్త్ బెల్ట్ లో పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఇంకా స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకెళ్తుంది.
ఇలా లేటెస్ట్ గా 740 కోట్లకి పైగా నెట్ వసూళ్లు ఈ చిత్రం అందుకోగా ఇపూడి ఓ రేర్ రికార్డుని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. హిందీ మార్కెట్ లో ఓ సినిమా మూడో వారంలో 100 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది లేదట. కానీ దానిని పుష్ప 2 సాధింది ఒక అరుదైన రికార్డుని హింది సినిమా హిస్టరీలో సెట్ చేసింది. దీనితో పుష్ప గాడి ఖాతాలో మరో క్రేజీ రికార్డు పడింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.