మరోసారి రంగంలోకి దిగుతున్న బన్నీ

మరోసారి రంగంలోకి దిగుతున్న బన్నీ

Published on Jul 29, 2024 11:01 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. కాగా ‘పుష్ప2’ త్వరగా పూర్తి చేయడానికి అల్లు అర్జున్‌ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. విదేశాల నుంచి రీసెంట్ గా తిరిగొచ్చిన బన్నీ వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి ‘పుష్ప2’ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆల్ రెడీ రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం నుంచే ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు బన్నీ కూడా డేట్స్ ఇవ్వడంతో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరగనుంది. ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే ‘పుష్ప2’. అల్లు అర్జున్‌ – రష్మిక జంటగా నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు