హిందీలో సాలిడ్ జంప్ అందుకున్న “పుష్ప 2” వసూళ్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “పుష్ప 2”. మరి క్రేజీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ వెర్షన్ లో రికార్డు వసూళ్లు అందుకుంది. ఇలా హిందీలో ఓ రేంజ్ లో వసూళ్లు అందుకొని ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకోగా ఇపుడు అదనపు వసూళ్లతో దూసుకెళ్తుంది.

అలాగే ఈ సినిమా హిందీలో మరో వీకెండ్ లోకి రాగా మళ్ళీ సాలిడ్ జంప్ అందుకుంది. పి ఆర్ నంబర్స్ లెక్కల ప్రకారం మొన్న 12.5 కోట్లు నెట్ వసూళ్లు అందుకోగా నిన్న శనివారంకి సాలిడ్ జంప్ అందుకుంది. మరి శనివారంకి 8 కోట్ల జంప్ అందుకొని 20.5 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనితో మొత్తం 665.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. మరి ఈ ఆదివారం వసూళ్లు కూడా సాలిడ్ గా ఉంటాయి కాబట్టి 700 కోట్ల మార్క్ ని ఈ చిత్రం అందుకుంటుందో లేదో అనేది చూడాలి మరి.

Exit mobile version