ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన అంచనాలు చూస్తుంటే, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం అనిపిస్తుంది.
అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే ఏకంగా రూ.212 కోట్ల మేర వసూళ్లు సాధించాల్సి ఉంది. ఈ టార్గెట్ అందుకోవాలంటే ‘పుష్ప-2’ టికెట్ రేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ‘పుష్ప-2’ చిత్రానికి ఎంతమేర టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాయి అనేది చూడాలి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.