ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. అయితే, ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం విశేషం.
‘పుష్ప-2’ టీజర్ రిలీజ్ అయినప్పుడు అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ టీజర్‌లోనే అల్లు అర్జున్ గంగమ్మ జాతరలోని గెటప్‌తో పూనకాలు తెప్పించాడు. ఇక ఈ టీజర్ ఇప్పుడు ఏకంగా 150 మిలియన్‌కి పైగా వ్యూస్ దక్కించుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టీజర్‌లలో ఈ ఫీట్‌ను సాధించిన ఫస్ట్ ఎవర్ టీజర్‌గా ‘పుష్ప-2’ రికార్డును సెట్ చేసింది.
ఇక ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#Pushpa2TheRule becomes the first ever teaser from TFI to hit 150 MILLION+ views ????????
▶️ https://t.co/5Mvmxzyfrp#Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER 2024 ❤????#Pushpa2TheRuleOnDec5th ????????
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/s7C9oMepOq
— Pushpa (@PushpaMovie) October 26, 2024