Pushpa 2: ‘పుష్ప 2’ టీజర్‌కి బిగ్ స్క్రీన్స్‌పై మాసివ్ రెస్పాన్స్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘పుష్ప 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. ఇక ఈ చిత్ర టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ అయిన చిత్రాలకు యాడ్ చేసి థియేటర్లో ప్లే చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం వారు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, థియేటర్లలో ఈ టీజర్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుందని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ ేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version