సమీక్ష: “పుష్ప 2 – ది రూల్” – బన్నీ, సుక్కుల మాస్ తాండవం

సమీక్ష: “పుష్ప 2 – ది రూల్” – బన్నీ, సుక్కుల మాస్ తాండవం

Published on Dec 6, 2024 1:15 PM IST


విడుదల తేదీ : డిసెంబర్ 05, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేష్, తారక్ పొన్నప్ప, అనసూయ భరద్వాజ్ తదితరులు

దర్శకుడు : సుకుమార్

నిర్మాతలు : నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : మిరోస్లా క్యూబా బ్రోజెక్

ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమానే “పుష్ప 2 ది రూల్”. మరి ఈ భారీ చిత్రం ఆ అంచనాలు అన్నీ అందుకుందో లేదో ఇపుడు సమీక్షలో పరిశీలిద్దాం.

కథ:

ఇక కథ లోకి వస్తే.. పార్ట్ 1 కి కొనసాగింపు గానే పుష్ప రాజ్(అల్లు అర్జున్) ఎర్ర చందనం సిండికేట్ లో రారాజుగా తన భార్య శ్రీవల్లి(రష్మిక మందన్నా) మాట కోసం ఎంత దూరం అయినా వెళ్లగలిగేలా మారుతాడు. ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంత వరకు వెళ్లి రాజకీయాలు ఎలా శాసించాడు. మరోపక్క పుష్ప ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్) ఏం చేస్తాడు? పుష్ప కి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్(అజయ్) నుంచి ఇప్పటికి అయినా తెచ్చుకోగలిగాడా ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్ లతో దుమ్ము లేపే హై మూమెంట్స్ తో నిండి ఉందని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డిటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ లతో కన్నుల పండుగలా మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియెన్స్ కి ఫుల్ గా ఎక్కేస్తాయి అని చెప్పడంలో డౌట్ లేదు.

బన్నీ పై ఒకో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లే ని ప్రెజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి ఇలాంటి ఒక హీరో పాత్రని ఇష్టపడేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయువు పట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండాఫ్ అని చెప్పాలి. అప్పుడు వరకు చూసిన ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ సెకండాఫ్ లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్టాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ నే డామినేట్ చేసాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ జాతర సీన్ లో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అయితే నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో రప్ప రప్పా యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. అలాగే తన యాక్షన్ బ్లాక్ లు మ్యానరిజంలు అయితే తనలోని పర్ఫెక్ట్ నటుడుని చూపిస్తాయి.

ఇంకా జాతర సీన్ లో రష్మిక పై సీన్ విజిల్ కొట్టిస్తుంది. ఇంకా నటుడు ఫహాద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన తన వెర్సటాలిటీ చూపిస్తాయి. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు వారిపై ఫస్ట్ పార్ట్ కి రెండో పార్ట్ కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో దుమ్ము లేపేసింది. యువ నటుడు తారక్ పొన్నప్ప క్రేజీ రోల్ లో మ్యాడ్ పెర్ఫామెన్స్ అందించాడు, ఇంకా క్లైమాక్స్ లో పుష్ప రోల్ కి ఒక ఎమోషనల్ ముగింపు బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మెయిన్ గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్ లో కథ సాగినట్టు అనిపించదు. మెయిన్ గా కొన్ని సీన్స్ తో మాత్రమే అక్కడక్కడా సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్ తో మాత్రమే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహాద్ ఫాజిల్ రోల్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది.

తనపై ఒక క్రేజీ ఇంట్రడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోయింది అనే భావన ఆడియెన్స్ లో కలుగక మానదు. ఇంకా సెకండాఫ్ లో తన ప్రెజెన్స్ చాలా వరకు మాయం అయ్యిపోయింది. వీటితో పాటుగా సినిమా మొదలుకి, ఎండింగ్ కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది. అసలు పార్ట్ 3 అనే లీడ్ కి అంత ఎగ్జైటింగ్ గానే ఏది అనిపించదు. ఇది మాత్రం చాలా చప్పగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అవసరం అయ్యిన చోట అంతా ఆ గ్రాండియర్ ఖర్చు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో ఆ వింటేజ్ బ్యాక్ డ్రాప్ డీటెయిల్స్ గాని జాగ్రత్తలు కానీ బాగున్నాయి. ఇంకా సినిమాలో యాక్షన్ బ్లాక్ లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్, మ్యానరిజంలో వాటికి మరింత స్టైలిష్ నెస్ తీస్కుకొచ్చాడు.

దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లులో ఇంకా బాగుంది. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే.. పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పినట్టు తన మార్క్ డీటైలింగ్ గాని అల్లు అర్జున్ సహా ఇతర పాత్రలని ఆవిష్కరించిన విధానం ముఖ్యంగా ఎమోషన్స్ ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని తను అందిస్తారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్ ఉన్నట్టు అనిపించదు, ముగింపు కూడా ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుణ్ణు కానీ ఉన్నంతలో మాత్రం అదరగొట్టేసారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పుష్ప 2 ది రూల్” టైటిల్ కి తగ్గట్టు గానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మాంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ పీక్ పెర్ఫామెన్స్ తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతీ ఒక్కటీ డెఫినెట్ గా ఆడియెన్స్ తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి, నవ్విస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పుష్ప పార్ట్ 2 వరకు ఆడియెన్స్ కి అసలు నిడివితో సంబంధమే లేకుండా మళ్లీ మాసివ్ ట్రీట్ ని అంతకు మించే అందిస్తుంది. సో థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యండి.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు