మైల్‌స్టోన్ మార్క్‌కి చేరువలో ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఈ మూవీ ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతూ దూసుకెళ్తోంది.

అయితే, ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర భారీగా నమోదవుతున్నాయి. ‘పుష్ప-2’ మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.922 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీకి వస్తున్న ట్రెమెండస్ రెస్పాన్స్‌తో సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

అల్లు అర్జున్ విధ్వంసకర నటనకు రష్మిక మందన్న సాలిడ్ పర్ఫార్మెన్స్, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version