హిందీ సినిమా చరిత్రలో ‘పుష్ప 2’ సెన్సేషన్!

హిందీ సినిమా చరిత్రలో ‘పుష్ప 2’ సెన్సేషన్!

Published on Dec 20, 2024 6:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది.

హిందీ సినీ చరిత్రలోనే ‘పుష్ప-2’ ఓ సెన్సేషనల్ మూవీగా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’ హిందీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.632.50 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో హయ్యెస్ట్ ఎవర్ వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ తాండవం చేస్తున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ నట విశ్వరూపం తో పుష్ప-2 మూవీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే ఈ సినిమా రూ.1508 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు