నార్త్ అమెరికాలో మరో మార్క్ అందుకున్న “పుష్ప 2” వసూళ్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా రికార్డు ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకుంది. ఇలా ఒక్క తెలుగు స్టేట్స్ లో సహా యూఎస్ మార్కెట్ లో రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోగా నార్త్ అమెరికాలో పుష్ప 2 లేటెస్ట్ వసూళ్లు ఇపుడు తెలుస్తున్నాయి.

ఇక్కడ పుష్ప 2 మరో రికార్డు మార్క్ 13 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని టచ్ చేసినట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఫైనల్ రన్ లో పుష్ప 2 ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version