హిందీలో “పుష్ప 2” జాతర.. ఇక మిగిలింది ఆల్ టైం రికార్డు మాత్రమే

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” ఇపుడు ఎలాంటి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుందో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 వరల్డ్ వైడ్ వసూళ్ళలో హిందీ వసూళ్లు ఎంత కీలక పాత్ర పోషించాయి అనేది అందరికీ తెలుసు. మరి ఇలా లేటెస్ట్ గా పుష్ప 2 రికార్డు వసూళ్లు హిందీలో కొట్టి సంచలన మైల్ స్టోన్ అందుకుంది.

నిన్న శనివారం హైయెస్ట్ వసూళ్లు హిందీలో సాధించి ఏకంగా 500 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని అందుకొని దుమ్ము లేపింది. అయితే మొత్తం పది రోజుల్లో పుష్ప 2 హిందీలో 507.5 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనితో హిందీ సినిమా చరిత్రలోనే ఈ మార్క్ ని అత్యంత వేగంగా అందుకున్న సినిమాగా పుష్ప 2 నిలిచింది. అలాగే ఇక నెక్స్ట్ మిగిలి ఉన్నది మాత్రం ఆల్ టైం రికార్డు మార్క్ మాత్రమే అని చెప్పాలి. దీనిని కూడా పుష్ప 2 ఈజీగా దాటేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Exit mobile version