మేకింగ్‌లోనూ పుష్పరాజ్ వైల్డ్‌ఫైర్

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా ‘పుష్ప-2’ సినిమా ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్లాయి. ఇక సోమవారం రోజున జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ‘పుష్ప-2’ కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడ్డారో మనకు ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తుంది. అల్లు అర్జున్ చెప్పినట్లుగా ఈ సినిమా కోసం పుష్ప-2 యూనిట్ మొత్తం ప్రాణం పెట్టారు. ఇలా మేకింగ్ వీడియో కూడా వైల్డ్‌ఫైర్ రేంజ్‌లో ఉందని ప్రేక్షకులు ఈ మేకింగ్ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version