వైరల్: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు క్రికెటర్ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా ఇపుడు ఈ సీక్వెల్ కూడా క్రేజీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే పుష్ప 1 నుంచి అల్లు అర్జున్ మాస్ మ్యానరిజం తగ్గదేలే అంటూ చేసిన గెశ్చర్ ఎంత ఎక్కువ రీచ్ అందుకుందో అందరికీ తెలిసిందే. మరి లేటెస్ట్ గా ఇది ఆస్ట్రేలియా గడ్డపై సెన్సేషనల్ గా మారింది.

ప్రస్తుతం భారత జట్టుకు ఆస్ట్రేలియా జట్టుకు ఆస్ట్రేలియా లోనే హీట్ ఎక్కించేలా టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ టెస్ట్ మాచ్ లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సాలిడ్ హాఫ్ సెంచరీ కొట్టి తన బ్యాట్ తో గడ్డం కింద నుంచి తగ్గేదేలే అంటూ మాస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనితో స్టార్ స్పోర్ట్స్ వారు హిందీ డైలాగ్ తో పోస్ట్ చేయడమే కాకుండా అక్కడ కామెంట్రీ లో కూడా పుష్ప అంటూ హైప్ ఇచ్చారు. దీనితో పుష్ప మేనియా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.

Exit mobile version