వైరల్ పిక్ : దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ‘పుష్ప’ డైరెక్టర్

వైరల్ పిక్ : దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ‘పుష్ప’ డైరెక్టర్

Published on Dec 30, 2022 7:22 PM IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమకి తొలిసారిగా ఆర్య మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ మూవీ అప్పట్లో రిలీజ్ తరువాత మంచి విజయం అందుకుని దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అనేక సక్సెస్ఫుల్ సినిమాలతో ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో కొనసాగుతున్న సుకుమార్, ఇటీవల అల్లు అర్జున్ తో పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.

అతి త్వరలో దానికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి హ్యాపీగా దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు సుకుమార్. వారి ఫ్యామిలీ అక్కడ ఎంజాయ్ చేస్తున్న పిక్ ని కొద్దిసెఫ్య్ క్రితం సుకుమార్ సతీమణి తబిత తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని సుకుమార్ ఫ్యామిలీ అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇండియాకి తిరిగివచ్చిన వెంటనే పుష్ప ది రూల్ షూటింగ్ మొదలుకానుంది. కాగా ప్రస్తుతం సుకుమార్ ఫ్యామిలీ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు