1 బిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న “పుష్ప” మ్యూజిక్ ఆల్బమ్..!

Published on Jan 20, 2022 3:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క మ్యూజిక్ ఆల్బమ్ అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ ప్లస్ వ్యూస్‌ని టచ్ చేసింది. అయితే ఇటీవలి కాలంలో అతిపెద్ద చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ ఇదే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :