“పుష్ప” టీజర్ మాస్ స్పీడ్..1 మిలియన్ దిశగా.!

“పుష్ప” టీజర్ మాస్ స్పీడ్..1 మిలియన్ దిశగా.!

Published on Apr 9, 2021 11:01 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మరి నిన్న బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం తాలూకా మోస్ట్ అవైటెడ్ టీజర్ ను విడుదల చేసారు. మరి అక్కడ నుంచి దీనికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ కొనసాగుతుంది. మామూలుగానే బన్నీ వీడియోస్ కు యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.

కానీ పాన్ ఇండియన్ స్పార్క్ కావడంతో దీనికి అంతకు మించిన స్థాయిలోనే రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటికే 3 కోట్ల 10 లక్షల వ్యూస్ దాటిన ఈ టీజర్ అంతే మాస్ స్పీడ్ లో 1 మిలియన్ లైక్స్ దిశగా వెళ్తుంది. ఇప్పటికే 9 లక్షల 31 వేలు దాటేసింది సో 1 మిలియన్ క్రాస్ చెయ్యడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి ఈ టీజర్ ఎప్పుడు ఆ రికార్డును లాక్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు