‘పుష్ప 3’ మొదలయ్యేది అప్పుడే !

‘పుష్ప 3’ మొదలయ్యేది అప్పుడే !

Published on Mar 25, 2025 2:00 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 1, 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప 3 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 3 గురించి ఓ క్రేజీ అప్ డేట్ ని నిర్మాత మైత్రీ నవీన్ రివీల్ చేశారు. సుకుమార్, చరణ్ 17వ సినిమాని పూర్తి చేసిన తర్వాత, అంటే 2027 లో పుష్ప3 సినిమాని స్టార్ట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే, పుష్ప 3 సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు పుష్ప 3 సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు