ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 – ది రూల్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపిస్తూ ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మనం చూశాం. పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ ఎలాంటి విజయఢంకా మోగించిందో అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది. ‘పుష్ప 2’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లా్ట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకుంది. ఇక నేటి(జనవరి 30) నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో అదనంగా యాడ్ చేసిన 20 నిమిషాల ఫుటేజీతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. థియేటర్లలో ఈ సీన్స్ మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో వీటిని వీక్షించవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపెట్టాడు అల్లు అర్జున్. అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.