అమితాబ్ షోలో పవన్ పై ప్రశ్న వైరల్.!


బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే మన టాలీవుడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” లో అద్భుతమైన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్ తో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి బిగ్ బి కేవలం బిగ్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా హోస్ట్ గా ఎప్పుడు నుంచో ఓ క్రేజీ షో చేస్తున్నారు. అదే ‘కోన్ బనేగా కరోడ్ పతి’. దీనినే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు గా కూడా కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చేసారు.

అయితే లేటెస్ట్ గా అమితాబ్ షోలో మన టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశ్న ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఓ కపుల్ పాల్గొనగా వారికి ఇటీవల దక్షిణాదిలో డిప్యూటీ సీఎం అయ్యిన ఓ స్టార్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దీనితో ఈ బిట్ ని పవన్ ఫ్యాన్స్ రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ఆ ప్రశ్నకి జంట ఆడియెన్స్ పోల్ తీసుకోగా 50 శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ పేరునే సెలెక్ట్ చేయగా వారు కూడా అనే సమాధానం ఎంచుకున్నారు. దీనితో 1 లక్ష 60 వేలు వారు గెలుచుకున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Exit mobile version