పీపుల్స్ స్టార్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న యాక్టర్ ఆర్.నారాయణ మూర్తి. విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ మాస్ ఆడియెన్స్‌కు దగ్గరైన ఈ స్టార్ హీరో గతకొంత కాలంగా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే, ఆయన రీసెంట్గా అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
నారాయణ మూర్తి స్వల్ప అనారోగ్యం బారిన పడటంతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలిసింది. నిమ్స్ వైద్యులు డాక్టర్ బీరప్ప వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందడం.. నారాయణమూర్తి గురించి ఆరా తీయడంతో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక తాజాగా నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దేవుడి దయ వల్ల తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. డాక్టర్ బీరప్ప అండ్ టీమ్‌కి తాను రుణ పడి ఉంటానని.. తన క్షేమాన్ని కోరుకున్న అభిమానులకు పాదాభివందనాలు తెలిపారు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి. ఏదేమైనా తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా తిరిగి రావడం సంతోషంగా ఉందని అభిమానులు తెలిపారు.