Game Changer: మాస్ కి ఎక్కేస్తున్న ‘రా మచ్చా మచ్చా’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తన మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో సిద్ధం చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానుల్లో ఇప్పుడు మరింత ఆసక్తి పెరుగుతూ వస్తుంది. మరి సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ అయితే ఇప్పుడు అదరగొడుతుంది అని చెప్పాలి.

మెయిన్ గా తెలుగు హిందీ మాస్ ఆడియెన్స్ కి బాగా ఎక్కేస్తుందని చెప్పాలి. అలాగే యూట్యూబ్ లో కూడా తెలుగు అండ్ హిందీ వెర్షన్ కి కలిపి ఇప్పుడు 42 మిలియన్ కి పైగా వ్యూస్ ఈ సాంగ్ కి నమోదు కావడం విశేషం. దీనితో ఈ పక్కా మాస్ సాంగ్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి బాగానే ఎక్కేస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version