సుదీప్ ‘విక్రాంత్ రోణా’ నుండి ‘రా రా రక్కమ్మ’ వీడియో సాంగ్ రిలీజ్

Published on Aug 12, 2022 7:06 pm IST

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణా. పాన్ ఇండియా మూవీగా ఎంతో భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నీతా అశోక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జాక్వలీన్ ఫెర్నాండేజ్ కీలక రోల్ చేసింది. విలియం డేవిడ్ ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీకి అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించారు.

థ్రిల్లింగ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సాంగ్స్ కూడా అందరినీ అలరించగా ముఖ్యంగా ఇందులో మాస్ బీట్ తో సాగే రా రా రక్కమ్మ సాంగ్ అయితే యువత తోపాటు మాస్ ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ యొక్క ఫుల్ వీడియోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. గ్రాండియర్ విజువల్స్ తో పాటు సుధీప్, జాక్వలీన్ ల అదరగొట్టే స్టెప్స్ తో ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :