Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుండి రాకింగ్‌గా ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుండి రాకింగ్‌గా ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో

Published on Sep 28, 2024 7:00 PM IST

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ నుండి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో రాకింగ్ బీట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

ఈ చిత్ర దర్శకుడు శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే ఈ పాట ఆద్యంతం డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతున్నట్లుగా ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక రామ్ చరణ్ తనదైన గ్రేస్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేసి అభిమానులకు కావాల్సినంత ఎనర్జీ అందించాడు. ఈ పాటకు థమన్ రాకింగ్ మ్యూజిక్ అందించినట్లుగా ప్రోమోలో తెలుస్తోంది. ఇక ఈ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ను సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

‘గేమ్ ఛేంజర్’ సినిమాలో చరణ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సునీల్, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తుండగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు