‘రాహి రే’ అంటూ సోలో ట్రావెలింగ్ చేస్తోన్న న‌భా న‌టేష్‌!

ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శి హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘డార్లింగ్’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, అందాల భామ న‌భా న‌టేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. కాగా, ఈ సినిమాలోని రెండో లిరిక‌ల్ సాంగ్ ప్రోమోను తాజాగా మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

‘రాహి రే’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ను క‌పిల్ క‌పిల‌న్ పాడారు. న‌భా న‌టేష్ సోలో ట్రావెలింగ్ నేప‌థ్యంలో ఈ సాంగ్ రానుంది. ఇక ఈ సాంగ్ కు సంబంధించిన పూర్తి లిరిక‌ల్ వీడియో ను రేపు ఉద‌యం 11.07 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ‘హ‌ను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అన‌న్య నాగ‌ళ్ల‌, మొయిన్, శివా రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్, క‌ళ్యాణీ రాజ్ త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version