అవకాశాల కోసం మరోదారి వెతుక్కున్న రాశీ ఖన్నా

Published on Oct 27, 2020 2:04 am IST


రాశీ ఖన్నా.. అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్. కానీ కెరీర్లో మాత్రం బలంగా కుదురుకోలేకపోతోంది. ఒక హిట్ అందుకుంటే దాని వెనకే రెండు ఫ్లాప్స్ ఎదురవుతూ ఆమెను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఆమె కెరీర్లోని మంచి హిట్ చిత్రాలైన ‘ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’లను గమనిస్తే ఒక్కో హిట్ తర్వాత ఒకటి, రెండు పరాజయాలు ఉంటాయి. ఇవే ఆమెకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఆమె చివరగా కనిపించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పరాజయంతో ఆమెకు అవకాశాలు బాగా సన్నగిల్లాయి.

దానితోడు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమ పూర్తిగా మూతబడటంతో కొత్త సినిమాలు మొదలవక అవకాశాలు ఇంకా తగ్గిపోయాయి. ప్రజెంట్ ఆమె చేతిలో రెండు మూడు తమిళ చిత్రాలే తప్ప పెద్ద తెలుగు సినిమాలేవీ లేవు. అందుకే తిరిగి లైమ్ లైట్లోకి రావడానికి కొత్త దారిని ఎంచుకుంది ఆమె. భిన్నమైన ఫొటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను, ఇండస్ట్రీ జనాలను ఆకట్టుకుంటోంది. ఫోటోషూట్ల ద్వారా తనలోని స్పైసీ లుక్, ట్రెడిషనల్ లుక్ రెండూ చూపిస్తూ అలరిస్తోంది. ఇటీవల ఆమె చేసిన ఫోటోషూట్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. మరి ఈ స్పందన సినిమా అవకాశాలుగా మారి రాశీ ఖన్నాకు మనుపటి ఫామ్ తీసుకొస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More