రాశీ ఖన్నాకు ఇదొక మంచి అవకాశం

Published on Jan 28, 2021 12:00 am IST

హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రీమేక్ పనులు మొదలవగా మలయాళం రీమేక్ ఈరోజే ఆరంభమైంది. ఇందులో లీడ్ రోల్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేయనుండగా కథానాయకిగా రాధికా ఆప్టే పాత్రలో రాశీఖన్నా నటిస్తోంది. మలయాళంలో రాశీఖన్నాను ఇది సెకండ్ ప్రాజెక్ట్.

మొదటగా చేసిన ‘విలన్’ సినిమాకు గాను ఆమె ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం 2017లో విడుదలైంది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెకు మలయాళంలో భారీ ఆఫర్ తగిలింది. అందునా ట్రెండింగ్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరో సరసన కావడం విశేషం. ఈ సినిమా గనుక హిట్టయితే ఆమెకు మలయాళంలో కూడ మంచి కెరీర్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :