ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. వింటేజ్ వండర్ గా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆ మధ్య వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ అయితే మెస్మరైజింగ్ గా అనిపించింది.
ఇక దీనితో పాటు ఇప్పుడు టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు రాధా కృష్ణ నుంచి ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఓ ఆసక్తికర పోస్ట్ వచ్చింది. తన ఇన్స్టాగ్రమ్ లో ఈ వచ్చే కొత్త సంవత్సరం 2021లో లవ్ అండ్ రొమాన్స్ కు వెల్కమ్ చెప్పాలని పెట్టారు.దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాదిలోనే కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేసారు.
ఇప్పటికే ఈ చిత్రాన్ని కేవలం లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్ అలాగే మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిసిందే. మరి కొత్త ఏడాదిలో ఈ చిత్రం విడుదల ఎప్పుడో ప్రకటిస్తారో లేదో చూడాలి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పేరు మరియు ప్రభాస్ పేర్లు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి.