“RRR” రికార్డ్ బ్రేక్ చేసేసిన “రాధే శ్యామ్”.!

“RRR” రికార్డ్ బ్రేక్ చేసేసిన “రాధే శ్యామ్”.!

Published on Oct 24, 2020 8:13 PM IST


మన టాలీవుడ్ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి రెడీ అవుతున్న చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “రాధే శ్యామ్” చిత్రం. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కానున్నాయి.

అయితే మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాల నుంచి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా అది కాస్త రికార్డుల మయం అయ్యిపోతుంది. అలా RRR చిత్రం నెలకొల్పిన ఓ రికార్డును ఇప్పుడు తాజాగా వస్తున్న రాధే శ్యామ్ బద్దలు కొట్టేసింది. గత కొన్నాళ్ల కితం RRR(తెలుగు వెర్షన్) మోషన్ పోస్టర్ ను విడుదల చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ టీజర్ కు 24 గంటల్లో 4.6 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా దానిని ఇప్పుడు తాజాగా వచ్చిన బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్(తెలుగు వెర్షన్) 4.7 మిలియన్ వ్యూస్ తో ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ టీజర్ గా నిలిచి సరికొత్త రికార్డును సెట్ చేసింది. దీనితో RRR రికార్డులు కాస్త బ్రేక్ అయ్యి రాధే శ్యామ్ పేరిట పడ్డాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు