ప్రభాస్ ఛాయిస్, విజయ్ ఛాయిస్ ఒక్కటే.. ఇద్దరి సినిమాలకీ ఆయనే

Published on Nov 25, 2020 2:07 am IST

ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పిరియాడికల్ లవ్ స్టోరీగా ఉండనుంది. సినిమా ప్రధానంగా విజువల్ వండర్ గా ఉండనుంది. ప్రతి విజువల్ ఒక పెయింటింగ్ తరహాలో ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే సినిమాటోగ్రఫీ భాద్యతలను మనోజ్ పరమహంస చేస్తున్నారు. ఈయన గతంలో ‘ఏ మాయ చేశావే, కిక్ 2, రేసుగుర్రం, ధృవ నట్చత్తిరమ్’ లాంటి సినిమాలకు డీవోపీగా చేశారు. ఈయన పని చేసిన ప్రతి సినిమా విజువల్స్ పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ 65వ సినిమాకు ఈయన్నే డీవోపీగా తీసుకున్నారు. గతంలో ఈయన విజయ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘నన్బన్’ సినిమాకు వర్క్ చేశారు. అందుకే ఈయనతో ఇంకోసారి వర్క్ చేస్తున్నారు విజయ్. ఆ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ విడుదలయ్యాక ఈ సినిమా మొదలుకానుంది. ఇది కూడ భారీ బడ్జెట్ తరహా చిత్రమే. మొదట్లో దీన్ని మురుగదాస్ డైరెక్ట్ చేస్తారని అనుకున్నా ఏవో కారణాల వలన ఆయన తప్పుకుని నెల్సన్ దిలీప్ లైన్లోకి వచ్చారు.

సంబంధిత సమాచారం :

More