“సాహో” తరహా ప్లానింగ్ లోనే “రాధే శ్యామ్” కూడా.?

Published on Jul 10, 2020 9:13 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడొక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే అది బాలీవుడ్ లో కూడా విడుదల కావడం కామన్ అయ్యింది. ఎలాగో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్డం తెచ్చుకోవడం తో ఆ స్టార్డం ను నిలకడగా ఉండే విధంగా తనతో సినిమా చేస్తున్న మేకర్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

అలా తాను నటించిన లాస్ట్ చిత్రం “సాహో” కు అప్లై చేసిన స్ట్రాటజీ మాదిరి గానే ఇప్పుడు దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న “రాధే శ్యామ్” కు కూడా అలానే ప్లాన్ చేస్తేన్నారని చెప్పాలి. ముఖ్యంగా సంగీతం విషయం లో ఒకే షేడ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు సాహో కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది ముందు ప్రకటించి ఆ తర్వాత ఒక్కో సాంగ్ కు ఒక్కో టాప్ కంపోజర్ ను తీసుకున్నారు.

అయితే ఆ సమయంలో ఎవరు సంగీతం ఎవరు చేస్తున్నారు అన్నది పోస్టర్స్ లో ప్రకటించలేదు. ఇప్పుడు అదే విధంగా రానున్న “రాధే శ్యామ్” సినిమాకు కూడా సంగీత దర్శకుని పేరు ను ఎక్కడా మెన్షన్ చెయ్యలేదు. దీనితో ఈ సినిమాకు కూడా అదే సాహో తరహా ప్లానింగ్స్ ఏమన్నా చేస్తున్నారా అనిపిస్తుంది. మరి సినిమాకు ఎంతో కీలకమైన మ్యూజిక్ విషయం ఈ టీం ఎలాంటి మూవ్ తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More