“రాధే శ్యామ్” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం లో పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ విషయం ఉండటం విశేషం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Exit mobile version