రాధేశ్యామ్.. అంతా ముగిసినట్టే

Published on Feb 26, 2021 1:10 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా చాలా ఆలస్యమైంది. చిత్రీకరణకు చాలానే అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినా అన్ని వ్యయప్రయాసలకు ఓర్చి మేకర్స్ సినిమాను ముగిస్తున్నారు.

మొన్నటివరకు సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగియగా పాటలు మిగిలి ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అవి కూడ పూర్తైనట్టే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా మనోజ్ పరమహంస పనిచేశారు. తాజాగా ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ చేస్తున్న సినిమాకు మూవ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఆయన ‘రాధేశ్యామ్’ పనులన్నీ ముగించినట్టే. అంటే చిత్రీకరణ పరంగా ప్యాచ్ వర్క్ సహా అన్ని పనులు పూర్తైనట్టే అనుకోవాలి. సినిమా జూలై ఆఖరులో కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికి బృందానికి బోలెడంత టైమ్ చేతిలో ఉన్నట్టే.

సంబంధిత సమాచారం :