భారీ యాక్షన్ అడ్వెంచర్ మొదలుపెట్టిన రాఘవ లారెన్స్

భారీ యాక్షన్ అడ్వెంచర్ మొదలుపెట్టిన రాఘవ లారెన్స్

Published on Sep 14, 2024 9:00 PM IST

డైరెక్టర్ కమ్ హీరోగా రాఘవ లారెన్స్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ‘కాంచన’ సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు లారెన్స్.

ఈ క్రమంలో ఆయన తన కొత్త సినిమాను తాజాగా ప్రారంభించాడు. దర్శకుడు రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుంది. ఈ సినిమా బిగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు