విడుదల తేదీ : జనవరి 05, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు
దర్శకుడు : సంజీవ్ మేగోటి
నిర్మాతలు: K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు
సంగీతం: సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫీ: S. N. హరీష్
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
సంబంధిత లింక్స్: ట్రైలర్
శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం రాఘవ రెడ్డి. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.
కథ :
రాఘవరెడ్డి (శివ కంఠంనేని) ఓ కాలేజ్ ప్రొఫేసర్. ఐతే, క్రిమినల్స్ ని పట్టుకోవడంలో, క్లిష్టమైన కేసులను సాల్వ్ చేయడంలో రాఘవరెడ్డి ఎక్స్ పర్ట్. పోలీస్ లు సైతం రాఘవరెడ్డి సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ఐతే, రాఘవరెడ్డి పనిచేసే కాలేజ్‌లోకి లక్కీ(నందితా శ్వేత) స్టూడెంట్‌గా జాయిన్ అవుతుంది. తన యాటిట్యూడ్ తో పొగరుతో రాఘవరెడ్డితో ఆమె గొడవ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రాఘవరెడ్డికి తన కూతురు గురించి తెలుస్తోంది. ఇంతకీ, రాఘవరెడ్డి కూతురు ఎవరు ?, ఈ మొత్తం వ్యవహారంలో దేవకీ (రాశీ) పాత్ర ఏమిటి ?, ఆమెకు రాఘవరెడ్డికి మధ్య సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రాఘవరెడ్డి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన దేవిక పాత్ర.. ఆమె జీవితంలో రాఘవరెడ్డికి దూరం అయిన సంఘటనలు, వారి మధ్య ఉన్న అడ్డంకులు, మరియు నందితా శ్వేత ట్రాక్.. ఇలా మొత్తానికి ‘రాఘవరెడ్డి’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కంఠంనేని తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా నటించారు.
మాజీ హీరోయిన్ రాశి కూడా బాగానే నటించింది. అలాగే మరో హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో బాగానే నటించింది. అన్నపూర్ణ, రఘుబాబులతో పాటు కీలక పాత్రల్లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళిలు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రవీణ్, అజయ్ ఘోష్ కూడా సినిమాకు ప్లస్ అయ్యారు. అలాగే, బిత్తిరి సత్తితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ యాక్షన్ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినిమాలో కొన్ని బలమైన యాక్షన్ మూమెంట్స్ పెట్టి మంచి ఫీల్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా.. కొన్ని సీన్స్ మాత్రం వర్కౌట్ కాలేదు.
ఇక ప్రధాన పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. కథ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇక ప్లే కూడా వెరీ రెగ్యులర్ గా సాగింది. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
దీనికితోడు రాశి పాత్ర కూడా బలంగా అనిపించదు. ఆమె చెప్పిన డైలాగ్స్ కూడా బాగా విసిగించాయి. నందితా శ్వేత క్యారెక్టర్ లో డెప్త్ లేదు. ఓవరాల్ గా అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. మొత్తానికి ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీలో కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నా.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మాత్రం మిస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. యాక్షన్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని యాక్షన్ కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించినా.. టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘రాఘవ రెడ్డి’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అయితే , మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, శివ కంఠంనేనితో పాటు మిగిలిన నటీనటుల పనితీరు బాగుండటం కలిసొచ్చే అంశం. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని అంశాలు మాత్రమే కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team