నన్ను స్టార్ ను చేసింది ఆ హీరోనే – రాఘవేంద్రరావు

నన్ను స్టార్ ను చేసింది ఆ హీరోనే – రాఘవేంద్రరావు

Published on Apr 6, 2025 8:00 AM IST

తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు తన సినీ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనను స్టార్ ను చేసింది, ముఖ్యంగా దర్శకేంద్రుడిని చేసింది ఓ హీరో అని ఆయన చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనతో తీసిన ‘అడవి రాముడు’ నాకు ఇంత గొప్ప కెరీర్ ను ప్రసాదించింది’ అని ఆయన తెలిపారు.

రాఘవేంద్రరావు ఇంకా మాట్లాడుతూ.. ‘అడవి రాముడు సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఆ మూవీ షీల్ట్ ను ఇప్పటికీ నా ఇంట్లో పెట్టుకున్నాను. సీనియర్ ఎన్టీఆర్ తో నేను చాలా సినిమాలు చేశాను. కానీ, ఆయన నటన ముందు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేసేది. ఆయన లాంటి నటుడిని నేను ఇప్పటికీ చూడలేదు. పైగా ఎన్టీఆర్ కి నేను పెద్ద అభిమానిని’ అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు