కీర్తి సురేష్ “రఘు తాత” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్!


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రఘు తాత చిత్రం ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. నూతన దర్శకుడు సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జీ5 ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని కలిగి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని జీ 5 తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు మరియు కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం హోంబలే ఫిలింస్ సంస్థ యొక్క తొలి తమిళ నిర్మాణం. సీన్ రోల్డాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్ ఎస్ భాస్కర్ మరియు దేవదర్శిని కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version