ఇంటర్వ్యూ: కోమల్ ఆర్ భరద్వాజ్ – ఎవరూ టచ్ చేయని కథ ‘రహస్యం ఇదం జగత్’

ఇంటర్వ్యూ: కోమల్ ఆర్ భరద్వాజ్ – ఎవరూ టచ్ చేయని కథ ‘రహస్యం ఇదం జగత్’

Published on Nov 5, 2024 8:00 PM IST

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘‘రహస్యం ఇదం జగత్‌’’. మన పురాణాలు, ఇతిహాసాల గురించి.. శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించనుంది ‘రహస్యం ఇదం జగత్‌’ చిత్రం. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

మీ నేపథ్యం ఏమిటో చెబుతారా..?

నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్‌. అమ్మ కూడా కవితలు రాస్తుండేవారు. మా ఇంటి వాతావరణం నుంచే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచే నేను దర్శకుడవుతానని ఇంట్లో చెప్పేవాడిని. కానీ అమెరికా వెళ్లి ఎం.ఎస్‌ చేశాను. ఇక నా గురించి నేను రియలైజ్ అయిన తరువాత ఫిలిం స్కూల్‌లో జాయిన్‌ అయ్యాను. ఆ తరువాత చాలా షార్ట్‌ ఫిలింస్ చేశాను. చాలా అవార్డులు కూడా దక్కాయి. ఇక సినిమా తీయగలను అనే కాన్ఫిడెన్స్‌ వచ్చిన తరువాత ‘రహస్యం ఇదం జగత్‌’ సినిమా చేశాను. బ్యూటిఫుల్‌ కంటెంట్‌, వండర్‌ఫుల్‌ విజువల్స్‌ టెక్నికల్‌గా చాలా సౌండ్‌తో ఈ సినిమాను చేశాను.

సైన్స్‌ అండ్‌ మైథలాజికల్‌గా కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీయాలని ఎందుకనిపించింది?

దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కొత్త కథతో రావాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను ఉండే ప్లేస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీ చక్రం కోసం జరిగిన అన్వేషణ నన్ను బాగా ఇన్‌స్పయిర్‌ చేసింది. ఈ కథను ఇంట్రెస్టింగ్‌ చెప్పొచ్చు అనిపించింది. మన కథను, మన పురాణాలను తీసుకుని ఫిక్షన్‌ను యాడ్‌ చేసి లార్జన్‌దేన్‌ లైఫ్ కథ చెప్పాలి అనుకున్నాను.

ఈ కథలో ఉన్న ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏమిటి?

ఈ కథలో ఆడియన్స్‌ బాగా థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలు చాలా ఉన్నాయి. మన కథలు, మన పురాణాల గురించి మన పూర్వీకుల గురించి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. సైన్స్‌, వామ్‌హోల్స్‌ గురించి ముందే పురాణాల్లో రాశారు. ఈ సినిమా చూసిన వాళ్లు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతారు.

ఇలాంటి కాంప్లికేట్‌ కథను ఎంత వరకు సరళంగా చెప్పారు?

ఇలాంటి హెవీ కథను ఫోర్స్‌ఫుల్‌‌గా కాకుండా సింప్లిఫైగా చెప్పాను. ఈ కథలో సందర్భ, కథకు తగ్గట్టుగా క్యారెక్టర్స్‌, ఎలిమెంట్స్‌ ఉంటాయి. క్యారెక్టర్‌ ట్రావెల్స్‌లో ఈ కథలన్నీ బయటికొస్తాయి. చాలా సింపుల్‌ఫై చేశాం.

యూఎస్‌లో సాఫ్టవేర్‌ రంగంలో సెటిలైన మీరు దర్శకత్వం వైపుకు రావడం రిస్క్‌ అనిపించలేదా?

రిస్క్‌ ఉంది. కానీ దర్శకత్వం అనేది నా యాంబిషన్‌. పాషన్‌తో ఉన్న వాళ్లు అందరూ రిస్క్‌ తీసుకుని ఎదిగిన వాళ్లే. మణిరత్నం, రాజమౌళి, నాగ్ అశ్విన్‌ ఈ రోజు మంచి పొజిషన్‌లో ఉన్నారంటే వాళ్ల కెరీర్‌లో వాళ్ల కూడా ఎంతో రిస్క్‌ తీసుకున్నారు. నేను కూడా నా కథను, నా పొటెన్షియల్‌‌ను నమ్మి ఈ సినిమా చేశాను.

ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లను ఎందుకు తీసుకున్నారు?

ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ఆర్టిస్టులు నటులుగా ప్రూవ్ అయిన వాళ్లే. కొత్తవాళ్లతో.. ఈ కథ తెలియని వాళ్లతో సినిమా బెటర్‌గా ఉంటుందనేది నా ఫీలింగ్‌. ఎందుకుంటే ఇందులో ఉన్న సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌కు వాళ్లే ప్లస్‌గా ఉంటారు. ఇలాంటి కథలకు కొత్తవాళ్లే కరెక్ట్‌. కొత్తవాళ్లైనా చాలా బాగా నటించారు.

‘రహస్యం ఇదం జగత్‌’ టైటిల్‌ జస్టిఫికేషన్ ఏమిటి?

యూనివర్శ్‌ ఈజ్‌ మిస్టరీ. పురాణాల్లో లోకాల మధ్య తిరిగిన వాళ్లు వామ్‌హోల్‌, కాన్సెప్ట్‌కు సంబంధం ఉంది. లోకాల మధ్య తిరిగారు అంటారు. కానీ వాళ్లు ఎలా తిరిగారు.. 14 లోకాలు ఉంటే వీటిలో ఎన్నో కథలు ఉన్నాయి. ఈ జగతే ఒక రహస్యం.. అందులో మేము టచ్‌ చేసింది చిన్న పాయింట్‌.

మీ తదుపరి సినిమాలు ఏమిటి?

నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. బేసికల్‌గా బడ్జెట్‌తో రెడీగా ఉన్నాయి. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నా లోపాలు సరిదిద్దుకుని. నేను ఏ సినిమా తీసినా ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని కథలతోనే సినిమా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు