రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ గా వెబ్ సిరీస్ !

రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ గా వెబ్ సిరీస్ !

Published on Sep 20, 2020 10:30 PM IST

ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినప్పటి నుండి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ యువ చిత్రనిర్మాతలతో పాటు డైరెక్టర్స్ తో సహా ‘ఆహా’ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలో విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించే ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ గా నటిస్తోనట్లు తెలుస్తోంది.

కాగా వేణు ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకత్వం వహించట్లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తాడు. ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై నటీనటులు కూడా తమ ద్రుష్టి మళ్లిస్తున్నారు. అందుకే మెగా ప్రొడ్యూసర్ ఆహా అనే ఓ డిజిటల్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ను తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ షోలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు