దర్శక సంచలనం మారుతి సారథ్యంలో రూపొందిన భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు చిత్రం తో తెలుగు తెరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి, ఈ ఏడాది హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకుగాను అమెరికాలో వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు.
ఓ హై ప్రొఫైల్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. తన పుట్టినరోజును (అక్టోబర్ 24న) దీపావళి రోజున సెలబ్రేట్ చేసుకుంటున్న రాజ్ దాసిరెడ్డి తెలుగు లోనూ ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.