‘జోవియ‌ల్ స్టార్’ ట్యాగ్ తో వ‌చ్చిన‌ రాజ్ త‌రుణ్‌

‘జోవియ‌ల్ స్టార్’ ట్యాగ్ తో వ‌చ్చిన‌ రాజ్ త‌రుణ్‌

Published on Jul 26, 2024 8:29 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అత‌డు ఎంచుకునే క‌థ‌లు చాలా నేటివ్ గా ఉండ‌టంతో యూత్ వాటికి బాగా కనెక్ట్ అవుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో స‌రైన స‌క్సెస్ లేని రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు న‌టించిన ‘పురుషోత్త‌ముడు’ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇక ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో రాజ్ త‌రుణ్ కు ఓ కొత్త ట్యాగ్ వేశారు. ‘జోవియ‌ల్ స్టార్’ రాజ్ త‌రుణ్ అని టైటిల్ కార్డ్స్ లో చూసి ప్రేక్ష‌కులు ఒకింత స‌ర్ప్రైజ్ అయ్యారు. పక్కింటి కుర్రాడి త‌ర‌హా పాత్ర‌ల‌తో మెప్పించే రాజ్ త‌రుణ్ కి ఇది ప‌ర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని అత‌డి అభిమానులు అంటున్నారు.

మంచి ట్యాలెంట్ ఉన్న‌ప్పటికీ స‌రైన హిట్స్ లేని కార‌ణంగా వెన‌క‌బ‌డ్డ రాజ్ త‌రుణ్ ‘పురుషోత్త‌ముడు’ సినిమాతో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మ‌రి ఈ సినిమా అత‌డికి ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.

‘ప‌రుషోత్త‌ముడు’ సమీక్ష కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు