టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ రీసెంట్ గానే మూడు సినిమాలతో పలకరించిన సంగతి తెలిసిందే. మరి తన కెరీర్ లో సరికొత్త మేకోవర్ తో మరో యువ హీరో కాంబినేషన్ లో సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమానే “రామ్ భజరంగ్”. సి.హెచ్.సుధీర్ రాజు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.మరి మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది, దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం చూసేందుకు మంచి మాస్ గా కనిపిస్తుండగా ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ , గెటప్స్ లో కనిపిస్తున్నారు. మెయిన్ గా రాజ్ తరుణ్ నుంచి ఇది ఉహించని లుక్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.